You Like Translate - Any Language

About Me (Bpsjptforyou)

Tuesday, February 22, 2011

స్పైసీ ఎగ్ కుర్మా

hai frds

స్పైసీ ఎగ్ కుర్మా: "

కావలసినవి:

ఉడికించిన కోడిగుడ్లు.. నాలుగు

ఉల్లిపాయలు.. రెండు

పచ్చిమిర్చి.. ఆరు

పాలు.. ఒకటిన్నర కప్పు

జీలకర్ర.. 3 టీ.

ఆవాలు.. ఒక టీ.

కొత్తిమీరపొడి.. 2 టీ.

ధనియాలు.. ఒక టీ.

గరంమసాలా పొడి.. రెండు టీ.

నూనె.. తగినంత

ఉప్పు.. సరిపడా


తయారు చేయు విధానం:
F_EggCurry
F_EggCurry



ముందుగా పచ్చిమిర్చి, జీలకర్రలను కలిపి కాసిన్ని నీళ్లుచేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, నూనె పోసి, వేడయ్యాక ఆవాలు, ధనియాలు వేసి రంగు మారేదాకా వేయించి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించాలి. తరువాత అందులోనే పచ్చిమిర్చి ముద్దను కూడా చేర్చి 5 నిమిషాలు ఉడికించాలి. ఆపై అందులో పాలుపోసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా అందులో ఉడికించిన కోడిగుడ్లు వేసి మూతపెట్టి సన్నటి సెగపై ఉడికించాలి. కూర దగ్గరవుతుండగా, అందులో తగినంత ఉప్పు, గరంమసాలా పొడి, కొత్తిమీర పొడి వేసి కలపాలి. అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే రుచికరమైన స్పైసీ ఎగ్ కుర్మా తయారైనట్లే..!

"

No comments:

Post a Comment